తయారీ సమయం: 15 ని. (ఇద్దరికి సరిపోతుంది) కావలసినవి: కాలిఫ్లవర్ - 250 గ్రా ఉల్లిపాయ - 1 (75 గ్రా ) టమాట - 1/2 (75 గ్రా ) కొత్తిమీర - 35 గ్రా పచ్చి మిరపకాయలు - 2 ( 2 గ్రా) అల్లం - 1" ముక్క (10 గ్రా ) ఉప్పు - రెండు చిటికెలు పోపు కోసం: ఆవాలు - 1/2 టీ స్పూన్ జీలకర్ర - 1/2 టీ స్పూన్ కరివేపాకులు - 5 ఆకులు. నూనె - 1/4 టీ స్పూన్ |
విధానం:
(అ ). ముందుగా:
(అ ). ముందుగా:
- కాలిఫ్లవర్ని శుభ్రంగా వేడినీటిలో వేడినీటిలో కడిగి తరగాలి 1" ముక్కలుగా. తరవాత మైక్రోవేవ్ లో పెట్టే గాజు పాత్ర లోకి కాలిఫ్లవర్ని తీసుకోవాలి.
- ఉల్లిపాయనీ టమాటానీ 1/4" ముక్కలు గా విడివిడి గా తరగాలి.
- కొత్తిమీర, అల్లం ఉప్పు, మిరపకాయల్ని కలిపి చాపర్ లో వేసి పొడిగా గుండ చేయాలి.
- పోపు దినుసుల్నీ నూనె తో కానీ లేకుండా కానీ సువాసన వచ్చే వరకూ వేయించాక కరివేపాకుకలపాలి.
- కాలిఫ్లవర్ని మైక్రోవేవ్ లో మూత పెట్టి నీళ్ళు పోయకుండా 4 ని. పాటు మొత్తం పవర్ మీద ఉడికించాలి (మైక్రోవేవ్ సామర్ధ్యం చూసుకుని ఈ సమయం మార్చుకోవచ్చు).
- ఇంకో చిన్న గాజు పాత్ర లో ఉల్లిపాయ ముక్కల్ని 2 ని పాటు మైక్రోవేవ్ చేసి, టమాటా ముక్కలు మరో 1.5 ని పాటు మూత లేకుండా మైక్రోవేవ్ చేయాలి.
- బాగా దళసరిగా వున్న నాన్ స్టిక్ మూకుట్లో వేగిన పోపు కి కొత్తిమీర మిశ్రమం కలిపి 2 ని. సేపు మధ్యస్థ మైన సెగ మీద వేయించండి.
- దానికి వేగిన ఉల్లి- టమాటా మిశ్రమాన్ని కలపి మరో నిముషం సేపు వేయించండి. ఇపుడు ఉడికిన కాలిఫ్లవర్ కలిపి 2 ని. సేపు మధ్యస్థ మైన సెగ మీద వేయించండి.
- పొయ్యి కట్టేసి కూరని వడ్డించే పాత్ర లోకి మార్చండి.
- సాదరంగా వడ్డించండి.